TotalTollywood Logo
05 Sep 2010
Login Password Register? Forgot passwd?

Sidhu from Seekakulam
Movie Review : 3.25/5
by


Sidhu from Sikakulam
StoryEshwar
Screenplay Eshwar
DirectionEshwar
CameraDasaradhi Shivendra
EditingKotagiri Venkateswara Rao
MusicRadha Krishnan
Dialogs
Art
Action
Presenter
Producer Malla Vijay Prasad
Banner Wellfare Creations
ReleaseAug-14-2008
Reviewed onAug-14-2008
*ing: Shradha Das, Manjari, Allari Naresh
Movie Links
50 days of Sidhu celebrated in vizag (08/10/08)
Sidhu from Sikakulam (14/08/08)
Sidhu from Seekakulam on 25th (21/07/08)
Sidhu from Seekakulam pressmeet - Events
Sidhu from Seekakulam - Allari Naresh - Movie Stills
Sidhu from Sikakulam audio - Events
User Reviews 6
Post your review
Movie Review
Average User rating: 5


కంపేరిటివ్లీ అన్ని విధాలా రెండు పెద్ద సినిమాలతో పాటూ రిలీజ్ అయ్యింది సిద్దు ఫ్రం సీకాకుళం. ఆ చిత్రాలకు వుండే ఓపినింగ్స్ వల్లనో మరింకెందువల్లనో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ అయితే రాలేదు గానీ చూసిన వారందరూ ఆ రెండు చిత్రాలకన్నా ఇదే బావుందన్న గుడ్ టాక్ ని మాత్రం ఈ సినిమాకి ఇచ్చారు. నిజానికి ఈ సినిమాలో కొత్తదనం అన్నదేమీ ఈ చిత్రం లేకపోయినా ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా సమయం తెలీకుండా గడిచిపోయింది. సగటు ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళేదే వినోదం కోసం. ఈ చిత్రం వారికి కావలిసిన వినోదాన్ని డెఫినెట్ గా అందించింది అన్నది వాస్తవం. ఇక కధ విషయానికి వస్తే దిల్ వాలే దుల్హనియా దగ్గరనుండీ మొన్నటి ఢీ వరకూ నిన్నటి రెడీ వరకూ వస్తూ వున్న స్టోరీ నే, అయితే ఇందులో వున్న ఒక చిన్న ట్విస్ట్ కధా గమనాన్ని మార్చేస్తుంది. క్లుప్తం గా కధను గురించి చెప్పుకొంటే సిద్దు (నరేష్) ఆంద్రా యూనివర్శిటీ లో చదువుకొనే కుర్రాడు. అక్కడే చదువుకొంటున్న దివ్య (మంజరి) ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఘాఢంగా ప్రేమించుకొంటున్న సమయం లో దివ్య తండ్రి తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం దివ్య పెళ్ళిని తన ప్రత్యర్ధి కొడుకు తో నిశ్చయం చేస్తాడు. తండ్రి కి ఎదురు చెప్పలేని దివ్య తనను ఎక్కడికైనా తీసుకుపొమ్మని దొరికితే ఇద్దరినీ తండ్రి బతకనివ్వడనీ చెబుతుంది. ఇక్కడి వరకూ అంతా రొటీన్ స్టోరీనే. సాధారణం గా హీరో లేదూ నేను మీ వాళ్ళనందరినీ ఒప్పించి మరీ నిన్ను చేసుకొంటాను అనాలి. కానీ మన సిద్దు... బాబోయ్ ఇలా అయితే మనం విడిపోవడమే మేలు. నేను ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిని నువ్వు కూడా పెళ్ళి చేసుకొన్న తర్వాత అన్నీ మర్చి పోతావు అంటాడు. దీనితో షాక్ తిన్న దివ్య అయితే తన పెళ్ళి అంతా సిద్దూయే దగ్గరుండి చేయించాలనీ పెళ్ళి అయ్యేవరకూ కూడా అతను ఎక్కడా బాధ పడకుండా వుండగలిగితే తాను కూడా సిద్దుని మర్చిపోతానని కండీషన్ పెడుతుంది. దానికి ఒప్పుకొన్న సిద్దు ఆమె ఇంటికి వస్తాడు. ఇక అక్కడ ఏం జరిగింది, సిద్దు చివరివరకూ బాధ పడకుండా వుండగలిగాడా, జీవితం కన్నా ప్రేమ అంత గొప్పదేం కాదు అన్న అతని అభిప్రాయం మారిందా, ఒక వేళ అతను ప్రేమే గొప్పది అని తెలుసుకొంటే మరి దివ్యని ఎలా దక్కించుకొన్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

అత్యంత బిజీ హీరో గా మారిపోయిన నరేష్ సినిమాల నంబర్ పెరిగిపోయినా వాటిలో క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడం నిజం గా గొప్ప విషయమనే చెప్పాలి. తనకి సరిపోయే పాత్రలను ఎన్నుకోవడం లో నరేష్ చాలా పరిణితి సాధించాడు అంటే అది అతిశయోక్తి కాదు. అతని కామెడీ టైమింగ్ గానీ వాచకం గానీ అన్నీ ఎప్పటిలా వినోదాన్ని పంచేలానే వున్నాయి, అయితే ఈ సినిమాలో అతని డాన్స్ మూమెంట్స్ కూడా అద్బుతం గా వున్నాయని చెప్పాలి. కామెడీ సీన్స్ లో ఎంత నవ్వించగలడో సెంటిమెంట్ సీన్లని కూడా అంతే గొప్పగా చేయగలడు అని ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకొన్నాడు. ఇక కొత్తమ్మాయి మంజరి చాలా అందం గా వుండడమే కాదు అద్బుతం గా నటించగలను కూడా అని చెప్పకనే చెప్పింది. మంజరి రూపంలో తెలుగు సినిమాకు మరొక చక్కని హీరోయిన్ దొరికిందనే చెప్పాలి. ఈ చిత్రం లో ఇంకో హీరోయిన్ అయిన శ్రద్దా దాస్ అందాలు ఆరబోయడానికి ఎక్కడా సంకోచించలేదు. ఆ అమ్మయికి అంత ప్రాధాన్యత వున్న పాత్ర కూడా లబించలేదు. ఇక హీరోయిన్ తండ్రి గా జయప్రకాష్ రెడ్డి తనదైన స్టైల్ లో చేసుకొంటూ పోయాడు. దర్మవరపు, కొండవలస ల కాంబినేషన్, వేణుమాధవ్, ఖయ్యుం ల కాంబినేషన్ చక్కని హాస్యాన్ని పండించింది. ఇక రక్తపాతాన్ని కళ్ళారా చూడాలనుకొనే పాత్రలో ఎమ్ ఎస్ నారాయణ ఆద్యంతం నవ్వులు కురిపిస్తాడు. నరేష్ తండ్రి పాత్రలో కనిపించేది కాసేపే అయినా చంద్రమోహన్ చక్కగా చేసారు. ఇలా ఒకరని కాదు ఈ చిత్రం లో చేసిన వారందరూ చక్కగా నటించారు.

ఇక సాంకేతిక శాఖల గురించి మాట్లాడుకొంటే ఎంచుకొన్నది పాత కధే అయినా దానిని దర్శకుడు ఈశ్వర్ చెప్పిన విధానం చాలా బావుంది. కధనం లో చక్కని పేస్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా దాదాపు ఇ వి వి పంధాలోనే ఈ సిద్దు ఫ్రం సీకాకుళాన్ని తీర్చిదిద్దారు. డైలాగ్స్ కూడా చాలా బావున్నాయి. సింబాలిజం మార్క్ డైలాగ్ లు పాత ఇ వి వి సినిమాలను గుర్తుకు తెచ్చాయి. అన్నిటికన్నా ఒక చేత్తో కత్తి నూరుతూ ఒక చేత్తో కాలుని దువ్వెనెతో దువ్వుతున్న ఎమ్ ఎస్ ఎన్ ని ఏం చేస్తున్నావ్ అని అడిగితే నరకడానికి కత్తి నూరుతున్నా కయ్యానికి కాలు దువ్వుతున్నా అని చెప్పించడం చాలా బావుంది. అక్కడక్కడా కొన్ని బూతు జోకులు కూడా వున్నా అవి అంత ఇబ్బంది కరం గా అయితే లేవు. ఇక దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ బావుంది. కోటగిరి ఎడిటింగ్ బానేవుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ ఒక మెయిన్ హైలైట్ అని చెప్పాలి. కె.ఎమ్.రాధా కృష్ణన్ అందించిన సంగీతం వినసొంపు గా వుంది. జాంపండులాంటి, తెల్లారిపోనీకు, ఓ క్షణమైనా చాలు పాటలు చాలా బావున్నాయి. రాధా కృష్ణన్ ఫాస్ట్ బీట్ పాటల్లో కూడా మెలొడీని వదలడు అన్నదానికి నిదర్శనం కనకాంగి, రతనాంగీ, సారంగీ ఐ లవ్ యూ రా పాట. చక్కని పాటలతో పాటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి బాగా కుదిరింది అనే చెప్పాలి. ఇక దర్శకుడు ఈశ్వర్ కు ఇది తొలి చిత్రమే అయినా ఆ ఛాయలు ఎక్కడా కనపడలేదు. పాటల్లో కొన్ని చోట్ల ఇ వి వి మార్క్ కొట్టొచ్చినట్లు గా కనబడింది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఓ క్షణమైనా చాలు పాటను చాలా అద్బుతంగా చిత్రీకరించారు. టోటల్ గా సిద్దు ఫ్రం సికాకుళం పాత సారానే అయినా చాలా కొత్తగా ప్రెజెంట్ చేసారు అనడం లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించే అవకాశాలు వున్నాయి.


Post your review
Only registered users can rate the film. To rate the film please login
Login Password Register? Forgot passwd?
(Scale: 1-Worst/Avoid 2-Below Average 3-Average/one see 4-Good/Must see 5-Excellent)
Subject/Headline
Comment
User Reviews
Total number of reviews - 5


by anon user on 2008-08-22
Rating:

very good

Great
by anon user on 2008-08-22
Rating:

Great Great Great Great Great

great
by anon user on 2008-08-23
Rating:

great movie of the year

fantastic
by anon user on 2008-08-20
Rating:

one of the beautiful movie of telugu industry

good movie
by mithilesh on 2008-08-14
Rating: 5

Once again naresh acted in a good screenplay movie .....this is his hatrick hit after seema sastri and gamyam....narration is also very nice and some comedy sequences are outstanding...this movie is better than the two movies which had been released on 14....hope this movie will do better....

SEE ALL REVIEWS >>
Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.