ఆంధ్రప్రదేశ్ లొ మొదటి సారిగా యమహ
R-1 బైక్ లాంచ్ అయ్యింది. మే ౩౦న పేర్ల్
యమహ షొరూమ్ కొండాపూర్ వద్ద మొదలయ్యింది.
ఈ షోరూమ్ ని సీనియర్ ప్రొడ్యుసర్
అయిన అర్జునరాజు మనవడు సిద్దార్ధ్
కుమార్ ప్రారంభించారు. యమహ అధికారులు
అయిన తరెడ, యకియుగి లు జపాన్ నుండి
ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
R-1 ఖరీదు 12లక్షలు పైనే. ఈ కార్యక్రమానికి
నాగార్జున తనయుదు నాగచైతన్య కూడా
రావడం జరిగింది. స్వతహాగా బైక్స్
అంటే అసక్తి వున్న చైతన్య తన స్నెహితుడు
సిద్దార్ధ షోరూంకి అదే రోజు విచ్చెసారు.
ఇది ఇలా వుంటె నాగర్జున తనయుదు
హీరో గా వెండి తెర మీదకు రావడానికి
అన్ని కార్యక్రమాలూ పూర్తి అయ్యాయని
పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్
చేయనున్నారని ఇటీవలె అనుకొన్న
సంగతి తెలిసిందే. దాని కొసం చైతన్య
కి ఫొటొ సెషన్ కూడా జరపడమ్ జరిగింది.
అయితే పురి, మహేష్ బాబు ల చిత్రం
అనౌన్స్ అవ్వడంతొ ఇప్పుడు పూరి
ఈ చిత్రాన్ని చెయ్యకపోవచ్చు. అయితే
గతంలో దిల్ రాజు నిర్మించిన చిత్రాలకు
అసొసియెట్ గా వర్క్ చేసిన వాసు
వర్మ ఇప్పుడు నాగచైతన్య చిత్రాన్ని
డైరెక్ట్ చేయనున్నట్లుగా తెలిసింది.
వాసు వర్మ, దిల్ రాజు, అల్లు అర్జున్
ల కాంబినేషన్ లొ ఇది వరకే ఒక చిత్రం
రావాలసి వుంది కానీ ఆ చిత్రం రూపు
దిద్దుకోలేదు. అయితే చైతన్యకి
సరిపడే కధని వాసు వర్మ తయారు చేయడం
జరిగింది అని ఈ చిత్రం బహుసా ఆగష్టు
29thన గానీ సెప్టెంబరు 20న గానీ మొదలయ్యి, డిసెంబరు నుండి
రెగ్యులర్ షూటింగ్ అవకాశాలున్నట్లు
గా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.