"త్రీ" ఒక హాలీవుడ్ సినిమాని చూసిన ఫీల్ ని ఇస్తుంది . . . శేఖర్ సూరి
Gallery
రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రిషి, రాజీవ్ కనకాల, శాంతి చంద్ర, వూర్వశీ శర్మ లు ప్రధాన పాత్రధారులు గా శేఖర్ సూరి దర్శకత్వంలో ఫణిరాజ్, జి యెస్ బాబు లు నిర్మిస్తున్న "త్రీ" చిత్రం విడుదల కు సిద్దమయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రీ రికార్డింగ్ దశ లో వుందని దర్శకుడు శేఖర్ సూరి తెలిపారు. అలాగే ఈ చిత్రం తన స్నేహితుడి జీవితం లో జరిగిన ఒక యధార్ద సంఘటన
ఆధారం గా తీయబడిందనీ, థ్రిల్లర్ చిత్రాలలో ఈ చిత్రం ఒక సరిక్రొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందనీ, సాంకేతికంగా హాలీవుడ్ చిత్రాల స్తాయి లొ వుంటుందనీ ఆయన అన్నారు. అలాగే నిర్మాత ఫణిరాజ్ మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్ర లోనే మొదటి సారిగా బెలూన్ లైటింగ్ని ఉపయొగించి కొన్ని ముఖ్యమైన సీన్లను షూట్ చేసామని అన్నారు. ఖర్చు విషయంలో యెక్కడా రాజీ పడలేదని చిత్రం చూస్తున్నప్పుడు ఆ విషయం తెలుస్తుందనీ
అన్నారు. ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్ శేఖర్ సూరి గారి టేకింగ్, ఆయన కధాకధనాలే అని ఆయన అన్నారు. అన్నికార్యక్రమాలనూ తొందరలోనే పూర్తి చేసి జూలై లొ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాం అని మరొక నిర్మాత ఐన జి. యెస్. బాబు తెలిపారు.