Gallery
ఒకరికి ఒకరు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చిరపరచితుడైన నటుడు
శ్రీరామ్. ప్రస్తుతమ్ శ్రీరా మ్ కధానాయకుడిగా యాంక్ మూవీస్ బ్యానర్ పై మౌనహ్రుదయం
దర్శకుడు కె.రాజెశ్వర్ దర్శకత్వం లో అశోక్ కొత్వాని ప్తేమోత్సవం అనే చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పంజాగుట్ట వద్ద గల ఈ చిత్రం ఆఫీస్ లో
జూన్ 6 న జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సాగర్
హాజరయ్యారు. ఈ సంధర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ కె.రాజేశ్వర్ ఒక చక్కని అభిరుచి
గల దర్శకుడనీ, అతను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం లో తాను హీరో గా నటించడం
చాలా ఆనందంగా వుందని, ఈ చిత్రం లో తాను ఒక కార్పొరేట్ వుద్యోగి గా నటిస్తున్నానని
చక్కని కమర్షియల్ వాల్యూస్ తూ చక్కని సెంటిమెంట్ వున్న చిత్రం అని ఆయన అన్నారు.
నిర్మాత అశోక్ మాటాడుతూ జూన్ 20
వరకూ మొదటి షెడ్యూల్
కొనసాగుతుందనీ, కొంత భాగం మలేషియా, సింగపూర్ లలో కూడా షూట్ చేయనున్నామని ఆయన
తెలిపారు. ఈ చిత్రం లో శ్రీరామ్ సరసన నమిత, హేమమాలిని (నూతన పరిచయం) లు హీరోయిన్ లు
గా నటిస్తుండగా యతీష్ సంగీతాన్ని అందిస్తున్నారు.