వాడేకావాలి ఆడియో ఆవిష్కరణ
Gallery
సాయిరాం శంకర్, సుహాసి లు జంట గా
రాజేంద్ర దర్శకత్వం లో రఘునాధ్
సోగి నిర్మిస్తున్న " వాడేకావాలి
" చిత్రం ఆడియో ఈ రోజు హైదరాబాద్
లో గల ప్రసాద్ లాబ్స్ లో ఆదిత్య
మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధు లు
గా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, వి.వి.వినాయక్,
బోయపాటి శ్రీను, సుకుమార్ లు హాజరయ్యారు.
సి.కళ్యాణ్ ఆడియో కెసెట్ ను రిలీజ్
చేయగా, వినాయక్ ఆడియో సి డి ని రిలీజ్
చేసారు. హాజరైన అతిధులందరూ ఈ చిత్ర
విజయాన్ని కాంక్షించారు. దర్శకుడు
సుకుమార్ మాట్లాడుతూ సాయిరాం శంకర్
మంచి స్పార్క్ వున్న నటుడనీ ఈ చిత్రం
పోస్టర్ లు చూస్తుంటె డెఫినెట్
గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనిపిస్తుందని
అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ
ఈ చిత్రం ఆడియో విన్నానని పాటలన్నీ
చాలా చాలా బాగున్నాయని డెఫినెట్
గా ఆడియో ఆ తర్వాత సినిమా సూపర్
హిట్ కావడం ఖాయమని అన్నారు. సంగీత
దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ
తాను ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం
వాడేకావాలి అని, నిజానికి ఈ ఆడియో
క్రెడిట్ అంతా రచయిత ప్రకాష్ కి
దక్కాలని, ప్రతి పాటా సంధర్బోచితంగా
వుంటుందని, ముఖ్యంగా అమ్మాయిల్లో
యెన్ని రకాలు వుంటారు అని వాటిని
పాట రూపంలో చాలా చక్కగా మలిచాడు
అలాగే నువ్వులేని నేను . .నేను కాను
అన్న పాట డెఫినెట్ గా టాప్ టెన్
లోనికి వెళుతుంది అని అన్నారు.
హీరో సాయి మాట్లాడుతూ ఆర్.పి గారు
చక్కని సంగీతాన్ని అందించారని
సినిమా కూడా అందరినీ అలరించే విధంగానె
వుంటుందని అన్నారు. ప్రస్తుతం
ఈ చిత్రం రి రికార్డింగు పనులు
జరుగుతున్నాయి.