ఇండియాలో సూపర్ స్టార్ గా వెలుగొందిన హీరో రజనీకాంత్. అంతే కాదు ఎదుగుతున్న కొద్ది ఒదుగుతూనే ఉండే హీరో రజనీ అదే ఆయన సూపర్ స్టార్ అవడానికి నిదర్శనం. ఎంత బిజీగా ఉన్నా ఆయనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో మాట్లాడుతూ వారిని సంతోషపెడుతూ ఉంటారు రజినీ. ప్రస్తుతం కొంత మంది అభిమాను కొరకు ఇల్లు కూడా కట్టిస్తున్నారన్న విషయం తెలిసిందే.
ఈ మధ్య నటుడు విజయ్ వసంత్ చెన్నైలోని పెళ్లి వేడుకకు రజినీ హాజరయ్యారు. తమ ఆరాద్య నటుడు రజనీ ఆడిటోరియంలో నడుచుకుంటూ వెళుతుంటే రజనీ తమ మధ్యే ఉడటంతో చూసేందుకు అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వచ్చేసారట. ఈ తోపులాటలో ఓ అభిమాని అదుపు తప్పి కింద పడిపోయాడట. అది గమనిస్తున్న రజనీ అభిమాని దగ్గరికెళ్లి చేయిచ్చి పైకి లేపారంట. ఇంత మంది జనం ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారట.