Raja's new film with Suneel Kumar Reddy started
17-Jul-2008
రాజా హీరో గా పూనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్ అయిన తీర్ధ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ శ్రావ్య ఫిలింస్ బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వం లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గల ప్రసాద్ ల్యాబ్స్ వద్ద జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన పత్రికా సదస్సులో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, రాజా, తీర్ధ, తనికెళ్ళ భరణి, కెమెరామేన్ సాబు జేమ్స్, సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం, ఈ చిత్రాన్ని కె.బి.ఆర్ పతాకం పై కొ-ప్రొడ్యూస్ చేస్తున్న బసిరెడ్డి, చిత్ర నిర్మాత రవీంద్రబాబు లు పాల్గొన్నారు.
ఈ చిత్రం లో తాను ఒక రెగ్యులర్ పాత్రనే పోషిస్తున్నానని అయితే హీరో రాజా గానీ ఈ చిత్రం లో మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఎల్.బి.శ్రీరాం గానీ తమ తమ కెరీర్ లో ఇంత వరకూ చేయని పాత్రలు చేస్తున్నారని వారిద్దరికీ ఆ పాత్రలు చాలా పేరు తెచ్చిపెడతాయనీ అలాగే హీరోయిన్ తీర్థ నటన నే ప్రొఫెషన్ గా తీసుకొన్న అమ్మాయి అనీ ఆమె కూడా ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందనీ ఒక చక్కని టెక్నికల్ టీమ్ తో మొదలైన ఈ చిత్రం డెఫినెట్ గా అందరినీ అలరించే చిత్రం అవుతుందనడం లో తనకు ఎటువంటి డౌటూ లేదని అన్నారు. నిర్మాతలలో ఒకరైన బసిరెడ్డి మాట్లాడుతూ సునీల్ తనకు ఈ కధ ను చెప్పిన వెంటనే తాను చాలా ఎక్సైట్ అయ్యానని కధ బాగా నచ్చడం వల్లనే ఈ చిత్ర నిర్మాణం లో తానూ ఒక భాగస్వామినయ్యాననీ అన్నారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్ర కధకు తుది రూపాన్ని ఇచ్చింది రచయిత గంధం నాగరాజు, ఎల్.బి.శ్రీరాం లనీ వారి కంట్రిబ్యూషన్ ఈ చిత్ర కధ లో చాలా యెక్కువగానే వుందనీ తాము ఇంతవరకూ శ్రావ్య ఫిలింస్ పై తీసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం ఒక ఎత్తు అనీ కె.బి.ఆర్ వారు కూడా తమకు తోడవ్వడం తో క్వాలిటీ పరం గా కూడా ఈ చిత్రాన్ని చాలా బాగా చేయడానికి తమకు తగిన స్కోప్ లబించిందనీ, ఇక ఈ కధ ను అనుకొన్నప్పుడు ఈ చిత్రానికి హీరో గా రాజా మాత్రమే సరిపోతాడని అనుకొన్నామని దానికి కారణం అతని లో వున్న ఇన్నోసెంట్ లుక్కేననీ ఆయన కూడా కధను విన్న వెంటనే ఈ చిత్రాన్ని చేస్తాను అనడం అలాగే ఒక చక్కని ఫ్రొఫెషనల్ నటి అయిన తీర్ధ తమకు హీరోయిన్ గా దొరకడం సాబూ జేమ్స్ వంటి కెమెరామేన్ ఈ చిత్రానికి వర్క్ చేయడం ఇలా అన్ని విషయాలూ ఈ చిత్రానికి కుదిరాయనీ డెఫినెట్ గా ఈ చిత్రాన్ని ఒక చక్కని కధాంశం తో అందరినీ అలరించే చిత్రం గా రూపొందించనున్నామని తెలిపారు. హీరో రాజా మాట్లాడుతూ హీరో గా సినిమాల్లో నటించడం అన్నది మామూలే అని అయితే మనసుకి నచ్చిన పాత్ర లు చేయడం అన్నది ఎల్లప్పుడూ కుదిరే పని కాదని అయితే తనకున్న చాలా షార్ట్ స్పాన్ లోనే ఇటువంటి ఒక అద్బుతమైన పాత్ర తనకు లభించడం నిజంగా తన అదృష్టం గానే భావిస్తున్నా అనీ ఈ చిత్రం లో ప్రేక్షకులకి ఒక కొత్త రాజా కనబడతాడని అన్నారు. రేపటి నుండీ సిటీ కి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం లో వున్న బేగం పేట అనే విలేజ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నదని అక్కడే కంటిన్యుస్ షెడ్యూల్ ప్లాన్ చేసామని చిత్ర నిర్మాత రవీంద్ర బాబు తెలిపారు.
Related Galleries:
|