Puri gave his voice for Youvatha??
15-Oct-2008
ఈ మద్య కాలం లో దర్శకులు తమ తమ చిత్రాల్లో గానీ, మిత్రుల చిత్రాల్లో గానీ చిన్న చిన్న అతిధి పాత్రల్లో కనిపించడం, లేదంటే చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అందించడం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ కొంచం కొత్తగా ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు. తన దగ్గర పనిచేసిన పరుశురాం (బుజ్జి) తొలిసారిగా దర్శకత్వం చేస్తున్న యువత చిత్రం లో ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అయితే అది ఎవరికి చెప్పాను, తానే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న విషయాలు తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందేనని పూరీ జగన్నాధ్ అంటున్నారు. నిఖిల్, అక్షరలు జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానున్నది.
|