సర్కార్ రాజ్ చిత్రం కోసం ఐడియా
యాత్ర సందర్భంగా ఆ చిత్రం యూనిట్
ఈ రోజు హైదరాబాద్ వచ్చింది. సర్కార్
రాజ్ ముఖ్య తారాగణం అయిన అమితాబ్,
అభిషేక్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లతో
పాటూ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్
వర్మ, నిర్మాత నవీన్ నిశ్చల్ లు
హైదరాబాద్ లో గల పి.వి.ఆర్.సినిమా
వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ
" ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా
ఆనందంగా వుంది, మరీ ముఖ్యంగా ఈ పంజాగుట్ట
దగ్గరకి రావడం ఇంకా హ్యాపీ గా వుంది.
ఎందుకంటే నేను ఒకప్పుడు ఇదే పంజాగుట్ట
లో ఒక వీడియో రెంటల్ షాప్ ని రన్
చేసేవాడిని, అయితే ఒక రోజు ఆఖరీ
రాస్తా అనే అమితాబ్ చిత్రం పైరేటడ్
కాపీ నా దగ్గర వుంది అని పోలీసులు
నా షాప్ మీద రైడ్ చేసి నన్ను లాకప్
లో పెట్టారు. మరి ఇప్పుడు నేను
అదే అమితాబ్ తో విజయవంత మైన చిత్రాలు
తీస్తున్నాను, ఇదంతా తలచుకొంటూ
వుంటే నాకు కొంచం గర్వంగా కూడా వుంది.
ఇక సర్కార్ రాజ్ విషయానికి వస్తే
ఎవరు ఎన్ని విధాలు గా మాట్లాడినా
సర్కార్ రాజ్ చిత్రం యెంత పెద్ద
విజయాన్ని సాధించింది అన్న విషయాన్ని
మొదటి వారం లో వచ్చిన వసూళ్ళు తెలియజేస్తాయి,
కేవలం మొదటి వారం పూర్తిఅయ్యెప్పటికే
ఈ చిత్రం యాభై కోట్లు వసూలు చేసింది,
యు.కె. లో సర్కార్ చిత్రం మొత్తం
ఒక లక్షా యాభైవేల పౌండ్లు కలెక్ట్
చేస్తే సర్కార్ రాజ్ చిత్రం కేవలం
నాలుగు రోజుల్లో రెండు లక్షల పౌండ్
లు కలెక్ట్ చేసింది ఇంతకన్నా ఈ
చిత్రం సూపర్ హిట్ అని చెప్పడానికి
వేరే వివరాలు అవసరం లేదు. ఇటువంటి
చిత్రాలను ఇప్పుడు ప్రజలు బాగా
ఆదరిస్తున్నారు అలాగే ఇక ముందు
కూడా ఇటువంటి పాటలు లేని సీరియస్
ఎమోషన్స్ తో కూడిన చిత్రాలు మరిన్ని
రానున్నాయి " అని అన్నారు.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ " రామ్
గోపాల్ వర్మ్ చెప్పిన లాకప్ విషయం
ఆయన లో వున్న డిటర్మినేషన్ ని తెలియజేస్తుంది,
ఆయన లో వున్న విల్ పవర్ ని తెలియ
జేస్తుంది, అయినా నా వల్ల లాకప్
లోనికి వెళ్ళినందుకు i am sorry raamoo . . . ఇక సర్కార్ రాజ్ గురించి చెప్పాలీ
అంటే చాలా వుంది. ముందు గా ఇటువంటి
చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ
నా కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
రామూ తో పని చేయడాన్ని నేను యెప్పుడూ
ఆస్వాదిస్తూనే వచ్చాను, నిజానికి
మేమందరం అద్భుతంగా నటించేసాము
అన్నది కానేకాదు, రాము ఎం చెబితే
అది మేము చేసాం అంతే, మా దగ్గర నుండి
తనకి కావలసింది తాను రాబట్టు కో
గలిగాడు కాబట్టే ఈ రోజు ఈ చిత్రం
ఇంతటి విజయాన్ని సాధించింది "
అని అన్నారు.
అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు
బచ్చన్ త్రయం, రామ్ గోపాల్ వర్మ
లు బదులిచ్చారు.
సర్కార్ కి మరో సీక్వెల్ ని తీసే
అవకాశం వుందా అన్న ప్రశ్నకు బదులు
గా రామ్ గోపాల్ వర్మ " may be " అని సమాధానమిచ్చారు. సర్కార్ కి
సర్కార్ రాజ్ కి మధ్యన నిప్పు (ఆగ్
చిత్రం గురించి) ఎందుకు పెట్టారు,
ఆగ్ చిత్రం గురించి మీరు ఇప్పుడు
ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు
జవాబు గా " ప్రతి సినిమా చేసే ముందు
అది బాగుంటుంది అనిపించే చేస్తాము,
దానిని ప్రజలు ఆదిరిస్తారా లేదా
అన్నది తరువాతి విషయం, ఇక ఆగ్ గురించి
నా ఫీలింగ్ ఏంటి అంటే . . . . ఐ ఫీల్ టెరిఫిక్
" అని బదులిచ్చారు. అయితే అక్కడే
వున్న అభిషేక్ బచ్చన్ " ఎప్పుడూ
ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్న విషయమే
ముఖ్యం, ఇప్పుడు సర్కార్ రాజ్ పెద్ద
విజయాన్ని సాధించింది, మేమందరం
ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం,
ఇప్పుడు గతం గురించి గానీ ఆగ్ గురించి
గానీ అనవసరం " అని అన్నారు. అమితాబ్,
అభిషేక్ లు ఇద్దరితోనూ నటించిన
మీరు ఆ ఇద్దరి మద్యనా వున్న సామ్యం
గురించి చెప్పండి అని ఐశ్వర్యా
రాయ్ ని అడిగినప్పుడు " దీనికి
సమాధానం చెప్పడం కొంచం కష్టమే, అయితే
ఈ ఇద్దరితోనూ పని చేయడం నిజంగా
చాలా అదృష్టం అనే చెప్పాలి, అమితాబ్
గారు నటన కు ఒక యూనివర్శిటీ వంటి
వారు. ఇక అభిషేక్ గురించి మాత్రం
ఒకటి చెప్పాలి షూటింగ్ లేనప్పుడు
అందరినీ నవ్విస్తూ నవ్వుతూ వుంటాడు
ఇక తన షాట్ వచ్చింది అంటే వెంటనే
ఆ పాత్రలోనికి పరకాయ ప్రవేశం చేసేస్తాడు,
నాకు అతని లో బాగా నచ్చే విషయం ఇది.
ఇక ఈ ఇద్దరితోనూ వర్క్ చేయడం అంటే
చాలా నేర్చుకోవడమనే చెప్పాలి "
అని అన్నారు. సర్కార్ రాజ్ లో రామ్
గోపాల్ వర్మ తో వర్క్ చేయడం గురించి
అభిషేక్ ని అడిగినప్పుడు జవాబు
గా " రాము నన్ను ఎప్పుడూ ఒక మంచి
పెర్ఫార్మర్ అంటూ వుంటారు, కానీ
నేను చేసేది మాత్రం ఇందులో ఏమీ
వుండదు, ముఖం సీరియస్ గా పెట్టుకొని
కామ్ గా అటూ ఇటూ చూస్తూ వుండడమే
" అని నవ్వుతూ బదులిచ్చారు.
మొత్తం మీద ఈ మీడియా తో ఇంట్రాక్షన్
కార్యక్రమమం ఆద్యంతం చాలా సరదాగా
జరిగింది. కొసమెరుపు ఏంటి అంటే
ఈ కార్యక్రమానికి రామ్ గోపాల్ వర్మ
కూతురు కూడా హాజరవ్వడం. ఆమెను చూసిన
ఐశ్వర్య రాయ్ ఇదిగో ఇక్కడ మీ అమాయి
కూడా వుంది మీరు ఏదన్నా తేడా మాట్లాడారో
"రామూ నాన్నా" అంటూ మీ చెవి పట్టుకొంటుంది
అని నవ్వుతూ అనడం మీడియాను కూడా
నవ్వులలో ముంచింది.