ఈ నెల లోనే సత్యమేవ జయతే అననున్న
రాజశేఖర్ . . .
గతంలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, అజయ్
దేవగణ్, అక్షయ్ లు ప్రధాన
పాత్రధారులు గా వచ్చిన సుపెర్
హిట్ చిత్రం ఖాకి ఆధారంగా జీవితా
రాజసేఖర్ దర్శకత్వంలో శివ శివాని
ప్రొడక్షన్స్ పతాకం పై సత్యమేవ
జయతే చిత్రం ఈ నెల 21 or 23 న ప్రారంభం కానున్నది. ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే హీరో రాజశేఖర్ అందించనున్నారు.
ఖాకి చిత్రంలో అమితాబ్ పాత్ర ను
రాజశేఖర్, జయప్రద పాత్రను సంజన,
ఐశ్వర్యారాయ్ పాత్రను క్లింటో,
అజయ్ దేవగణ్ పాత్రను మిలింద్ సోమన్
లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని
దాసరి నారాయణ రావు గారు సమర్పిస్తున్నారు.
(నిజానికి ఈ చిత్రానికి ఆర్దిక సహకారం
కూడా అక్కడనుండే వస్తుందని సినీ
వర్గాల వార్త) అయితే హిందీ చిత్రాన్ని
తెలుగు నేటివిటీ కి తగినట్లుగా
మార్పులు చేయడం జరిగింది అనీ హిందీ
లో తుషార్ కపూర్ పాత్రను తెలుగులో
హీరోయిన్ నీతూ చంద్ర చేయనున్నదనీ
అలాగే అక్షయ్ పాత్రను హీరో
శివాజీ గానీ అల్లరి నరేష్ గానీ
పోషించనున్నారనీ తెలియవచ్చింది.
ఈ చిత్రంలో హీరో పాత్ర కు సమానం
గా వుండే విలన్ పాత్రకు మొదట జగపతి
బాబు ని అడిగినట్లుగా అయితే డేట్స్
ప్రాబ్లమ్ వల్ల అది కుదరనందువల్ల
మిలింద్ సోమన్ ని సెలెక్ట్ చేసినట్లు
గా తెలిసింది. కాగా ఈ చిత్రానికి
సంగీతాన్ని గతంలో రాజశేఖర్ యెవడైతే
నాకేంటి చిత్రానికి సంగీతాన్ని
అందించిన చిన్నా అందించనున్నారు.
మొత్తం మీద ఈ చిత్రం ద్వారా తెలుగు
చిత్ర సీమలోనికి అతి చిన్న నిర్మాతలు
బేబీ శివాని, బేబీ శివాత్మిక లు
ప్రవేసించనున్నారు.