ఆర్య సీక్వెల్ గా చెప్పబడుతున్న
ఆదిత్య ఆర్ట్స్, సుకుమార్, అల్లుఅర్జున్
ల చిత్రం ఈ రోజు చాలా నిరాడంబరం
గా రామానాయుడు స్టూడియోస్ లో మొదలయ్యింది.
ఈ రోజు మంచి రోజు కావడం తో దేముడి
పటాల మీద ముహూర్తం షాట్ ను చిత్రీకరించారు.
నిర్మాత ఆదిత్య బాబు ఈ చిత్రం లోని
కొంతమంది సాంకేతిక నిపుణులు మాత్రమే
ఈ కార్యక్రమం లో పాల్గొన్నారని
తెలిసింది. నిజానికి ఈ చిత్రం
"ఆర్య" కు ఏ మాత్రం సీక్వెల్
కాదని కేవలం ఆ చిత్రం లోని పేర్లను
మాత్రమే ఇందులో వాడుతున్నారనీ,
ఆ చిత్రానికి ఈ చిత్రానికి వున్న
పోలికల్లా రెండూ ట్రైయాంగులర్
ప్రేమ కధలు కావడం మాత్రమేననీ అయితే
ఈ చిత్రం లోని అల్లు అర్జున్ క్యారెక్టర్
ఆర్య చిత్రం కన్నా ఎనర్జిటిక్ గా
వుంటుందనీ తెలియ వచ్చింది. ఈ చిత్రం
లో బన్ని సరసన హీరోయిన్ గా కాజల్
అగర్వాల్ నటిస్తుంది. ఈమె ప్రస్తుతం
రాజమౌళి, చరణ్ తేజ్ ల చిత్రం చేస్తున్న
సంగతి తెలిసింది. నిజానికి ఈ చిత్రం
లో హీరోయిన్ గా మొదటి నుండీ తమన్నా
పేరు ఎక్కువ గా వినిపించింది. అయితే
ఆ అమ్మాయి తమిళం లో మూడు చిత్రాలు
ఒప్పుకోవడం వల్ల డేట్స్ ఎడ్జస్ట్
కాకపోవడం వల్ల కాజల్ అగర్వాల్ ని
తీసుకొన్నట్లు గా తెలిసింది.