TotalTollywood Logo
31 Jul 2010
Login Password Register? Forgot passwd?


You are here: TotalTollywood >> Interviews
Interview with Rajendra Prasad
02-Oct-2008

Interview with Rajendra Prasad


Related Links
Need help with Telugu font?
English Version
User Comments

దక్షిణాది నటుల్లో తొలిసారిగా హాలీవుడ్ చిత్రం లో నటించిన ఘనత సొంతం చేసుకొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్. తమిళం, ఆంగ్లం రెండింటిలోనూ రూపొందిన "క్విక్ గన్ మురుగన్" చిత్రం లో ఈయన టైటిల్ రోల్ ని ప్లే చేసారు. మాంటొ క్రిస్టో ఇంటర్నేషనల్ సమర్పణలో, ఫాట్ ఫిష్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పై ఆనంద్ సురాపూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేసారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించిన విశేషాలను ఈ రోజు వుదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

నటుడిగా ఎన్నో రకాల పాత్రలను చేసిన మీకు ఈ క్విక్ గన్ మురుగన్ ఎలాంటి అవకాశం అని మీరు భావిస్తున్నారు?

ఒక నటుడి కి సరిఅయిన అవకాశం అన్నది రావడం నిజంగా చాలా గొప్ప విషయం. రామారావు గారికి పౌరాణిక పాత్రలు, అక్కినేని గారికి సామాజిక పాత్రల ద్వారా గొప్ప అవకాశాలు రావడం తద్వారా వారు వున్నత శిఖరాలు అధిరోహించడం జరిగింది. ఇప్పుడు ఈ టైమ్ లో నాకు లభించిన ఈ అవకాశం కూడా అటువంటిదే అని నా భావన. డెఫినెట్ గా ఈ క్విక్ గన్ మురుగన్ నా ప్రతిభకు లబించిన గొప్ప అవకాశం అనే చెప్పాలి. నాకు గాడ్ తప్పా ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేరు. నా ముప్పై రెండు సంవత్సరాల సినీ జీవితం లో నేను నమ్మిన సిద్దాంతం అవకాశం. అది రక రకాలు గా వస్తుంది. ఇప్పుడు ఈ క్విక్ గన్ ద్వారా వచ్చింది.

అసలు ఈ క్విక్ గన్ మురుగన్ ఎవరు?

దీనికి నేపథ్యం తమిళం. జాకీచాన్ చైనా వాడైనా ఇంగ్లీష్ లో ఎలా చూపుతున్నారో ఈ మురుగన్ ని కూడా అంతే. 60 - 70 దశకంలో వుండే కౌబాయ్ క్యారెక్టర్ ని లేటెస్ట్ గా తీసుకువస్తే ఎలా వుంటుంది అన్నదే ఈ సినిమా. ఇందులో కామెడీ అంతర్జాతీయ స్థాయిలో వుంటుంది.

ఈ క్విక్ గన్ మురుగన్ పాత్ర ఎలా పుట్టింది?

నిజానికి శశాంక్ ఘోష్ మురుగన్ ని చిన్న పాత్ర గా ఒక డాక్యుమెంటరీ తీసారు. తర్వాత నెమ్మది గా దానినే ఫుల్ లెంగ్త్ కధ గా ఏడాదిన్నర పాటు తీర్చి దిద్ది ఇప్పుడు చిత్రం గా మలిచారు. క్లుప్తంగా చెప్పాలంటే మురుగన్ శాఖాహారాన్ని ప్రోత్సహించే కౌబాయ్ అయితే విలన్ మాంసాహారాన్ని ప్రోత్సహిస్తాడు. శాఖాహారికీ మాంసాహారికీ మద్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. ఈ చిత్రం ద్వారా మన సంస్కృతి కూడా వెలుగులోనికి వస్తుంది. నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఏదొ ఒక మెసేజ్ వుంటుంది. ఈ సినిమాలో శాఖాహారం వంటికి మంచిది అన్న సందేశం వుంది.

ఈ చిత్రం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యిందని అన్నారు?

అవును. ఈ నెల పదహారు న జరిగే లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సౌత్ ఏషియన్ కేటగిరీ లో ఎంపిక అయిన ఐదు చిత్రాల్లో క్విక్ గన్ మురుగన్ కూడా ఒకటి. ఇది చాలా సంతోషదాయకమైన అలాగే గర్వకారణమైన విషయం. మీ శ్రేయోభిలాషి చిత్రం తర్వాత ఈ చిత్రం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ వాళ్ళు మొత్తం సినిమానే కొనేయడం.

కౌబాయ్ అంటున్నారు, ఇందులో స్పెషాలిటీస్ ఏంటి?

స్పెషాలిటీస్ అంటే ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ ను ఆస్కార్ విన్నర్ టిమ్ అందించారు. లాస్ ఏంజెల్స్ లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సినిమాకోసం నేను దాదాపు ముప్పై రోజులు గుర్రపు స్వారీ కూడా నెచుకొన్నాను. సినిమా షూటింగ్ అంతా ముంబై, హాంకాంగ్, హైదరబాద్ లోని నానక్ రామ్ గుడాల్లోనే జరిగింది. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పటికి అంతర్జాతీయ నటుడిగా కూడా మారాను. పూర్తి కమిట్ మెంట్ తో ఈ చిత్రాన్ని చేసాను.

హాలీవుడ్ సినిమా కదా అయితే పాటలూ గట్రా ఏం లేవా?

హాలీవుడ్ సినిమానే అయినా తమిళం లో కూడా తీసారు కాబట్టి రెండు పాటలు వున్నాయి. ఎం జి ఆర్ నటించిన ఒక చిత్రం లో సౌందర్ రాజన్ పాడిన "ఓ లిటిల్ ఫ్లవర్ సీ యువర్ లవర్" అన్న పాట ఒకటుంది. అలాగే నా ఆ ఒక్కటీ అడక్కు హీరోయిన్ రంభ మీద తీసిన ఒకపాట కూడా వుంది. రంభ ఇందులో ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ చేసింది. అలాగే అనూ మీనన్ హీరోయిన్ గా చేసింది.

అసలు క్విక్ గన్ మురుగన్ గా మిమ్మల్నే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి?

నిజానికి ఈ పాత్రను ఎంజిఆర్, ఎన్ టి ఆర్ లాంటి వాళ్ళు చేయాలి. ఈ అవకాశం నాకు దక్కడానికి ముఖ్య కారణం మీడియానే. దక్షిణాదిలో ప్రతి తెలుగువాడి ఇంటిలో మీడియా ద్వారా నా చిత్రాలు చూసే అవకాశం మీడియానే కల్పించింది. ఈ చిత్ర నిర్మాతగానీ దర్శకుడు గానీ చాలా సర్వేలు చేసిన తర్వాతనే చాలా మంది నా పేరుని ప్రతిపాదించిన తర్వాతనే నన్ను కాంటాక్ట్ చేసారు.

కౌబాయ్ చిత్రం అంటే మరి యాక్షన్ పరిస్థితి?

అవును. డెఫినెట్ గా యాక్షన్ కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది, వుంది కూడా. అయితే స్టంట్స్ అన్నిటినీ చాలా సహజం గా చిత్రీకరించారు. నాకు ఇదంతా చాలా కొత్త అనుభవం. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొనే యాక్షన్ పార్ట్ పూర్తి చేసాను. ఇంకో విశేషం ఏంటంటే హృతిక్ రోషన్ చిత్రాలకు స్టంట్స్ కంపోజ్ చేసినతనే ఈ సినిమాకీ స్టంట్స్ కంపోజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో నాజర్, రాజు సుందరం, సంద్య మృదుల్, గౌరవ్ కపూర్ వంటి వారు కూడా నటించారు.

నిజంగా మీరు ఇంత చక్కని పాత్ర చేసి తద్వారా తెలుగు నటన ని అంతర్జాతీయం చేయడం ఎంతైనా అభినందనీయం. మీరు ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ మీకు మా అందరి తరపునా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం.

Thank you very much. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.



Other latest in News
Actor turned Director : G V
Interview with Rajendra Prasad
Interview with Udaykiran
Chat with RGV on his new film and Raksha
Interview with Puri Jagannath
Gopichand
RGV on Raksha
Nikhil talks about Ankit, Pallavi & Friends
Nagarjuna
Interview with JD on Homam
Industry should stand united: Suresh Babu
No exposing; Not for money or career : Ullal
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.