Interview with G.V.Prakash
21-Jul-2008
18 సంవత్సరాలకే సంగీత రంగం లోనికి ప్రవేశించి ఇప్పటికే ఎనిమిది చిత్రాలకు సంగీతాన్ని అందించడమే కాకుండా గాయకుడిగా మొత్తం నలభై నుండీ యాభై దాకా పాటలు పాడిన జి.వి.ప్రకాష్ తో ఆయన ఇటీవల సంగీతాన్ని అందించిన ఉత్సాహంగా ఉల్లాసంగా చిత్రం విడుదల అవుతున్న సంధర్భం లో ఈ చిత్రం గురించీ, ఆయన సంగీతం గురించి జరిపిన మాటా మంతి.
ప్రకాష్ మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?
నేను స్కూల్ లో చదువుకొంటున్నప్పుడే నా స్నేహితులతో కలిసి ఒక బ్యాండ్ గ్రూప్ ని ఏర్పాటు చేసాను. చాలా ప్రొగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను సౌండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాను, సరిగ్గా అదే టైమ్ లో శంకర్ సార్ తన సినిమా కోసం ఒక కొత్త సంగీత దర్శకుడి కోసం చూస్తూ నాకు కబురు పెట్టారు. కొన్ని ట్యూన్ లు విన్న వెంటనే ఈ సినిమా నువ్వే చేస్తున్నావు అన్నారు. అలా వెయిల్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే అవకాశం కలిగింది. మొదటి చిత్రం తోనే చాలా అవార్డ్ లు అందుకొన్నాను. ఇక దాని తర్వాత అవకాశాలు ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తూ వున్నాయి.
తెలుగులో మీరు మొదటి సారిగా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఎలా సంభవించింది?
ముందుగా నా తొలి తెలుగు చిత్రం ఆడియోను విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఇక కరుణాకరన్ గారితో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. బేసికల్ గా మంచి మ్యూజిక్ సెన్స్ వున్న దర్శకుడాయన. నాకు ఆయన హ్యాపీ చిత్రం అంటే చాలా ఇష్టం కూడా. ఒక రోజు ఆయనే ఫోన్ చేసి నా సినిమా కి నువ్వు మ్యూజిక్ ఇవ్వాలి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను మొదటి నుండీ అవకాశాలు ఇమ్మని ఎవరినీ అడగలేదు. కరుణాకరన్ గారి తో మాత్రం వర్క్ చేయాలని వుండేది, అలాంటిది ఆయనే డైరెక్ట్ గా అడిగేసరికి వెంటనే చేసేస్తున్నా సార్ అని చెప్పేసాను. అలా నా తొలి తెలుగు చిత్రం మొదలయ్యింది.
మరి కధానాయకుడు చిత్రం కూడా మీరే చేస్తున్నారు . . మరి సూపర్ స్టార్ తో చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేయడం పట్ల మీ అనుభూతి . .
నిజానికి అది మాటల్లో చెప్పలేను. ఎవరికైనా రజనీకాంత్ గారితో సినిమా చేయాలనే వుంటుంది. మీరు అన్నట్లు నాకు ఆ అవకాశం తొందరగానే వచ్చేసింది. నేను ఆయనకు పెద్ద అభిమానిని, అలాంటిది ఏకంగా ఆయన సినిమాకే సంగీతం అందించే అవకాశం అంటే దానికన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. అయితే ఈ చిత్రం లో అవకాశం కూడా దానికదే వచ్చింది. రజనీ సార్ నా ముందు చిత్రాల పాటలు విని ఆయనకు నచ్చడం వల్ల ఈ చిత్రం చేయమని చెప్పారు.
ఇప్పటి వరకూ ఎన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు . . .
కధానాయకుడు నా ఎనిమిదవ చిత్రం. నేను at the age of 18 ఈ రంగంలోనికి ప్రవేశించాను now i am 22. ప్రస్తుతం చేయడానికి చాలా సినిమాలు వున్నాయి. అయితే నేను నా సినిమాలని చాలా సెలెక్టివ్ గా చేసుకొంటూ వస్తున్నాను. దర్శకుడూ, చిత్ర కధ ఇలా అన్నిటినీ పరిగణన లోనికి తీసుకొన్న తర్వాతనే ఏ చిత్రమైనా ఒప్పుకొంటున్నాను.
కృష్ణవంశీ గారితో ఒక చిత్రం చేస్తున్నారని విన్నాము, దాని గురించి?
ఇంకా ఏదీ పూర్తిగా అనుకోలేదు. కానీ ఆయనతో కూడా నాకు వర్క్ చేయాలనే వుంది. అయితే నేను ప్రస్తుతం సెల్వ రాఘవన్ చిత్రం పని లో పూర్తిగా మునిగి పోయి వున్నాను.
ఊత్సాహంగా ఊల్లాసంగా గురించి చెప్పండి . . .
ఇది ఒక చక్కని ఫీల్ వున్న చిత్రం. సంగీతానికి మంచి స్కోప్ వున్న చిత్రం. ఇందులో అన్ని రకాల పాటలూ వున్నాయి. అన్ని ఎమోషన్స్ నీ చక్కగా క్యారీ చేసే పాటలు, చిత్రం లో అతికనట్లు గా కాకుండా సంధర్భానికి తగిన పాటలు ఇందులో వున్నాయి. ఆడియో కి కూడా చక్కని స్పందన వచ్చిందన్నారు.
మీకు ఎటువంటి సంగీతం అంటే ఎక్కువ ఇష్టం?
నా ఇష్టాలు సీజన్స్ ని బట్టీ మారిపోతూ వుంటాయి. ఒక్కోసారి పూర్తిగా మెలోడీలంటే ఇష్టపడతాను, మరొక సారి పూర్తి ఫాస్ట్ బీట్ మూడ్ లో వుంటాను. అయితే ఇదంతా నేను వినే సంగీతం గురించి మాత్రమే, నేను కంపోజ్ చేసేది మాత్రం పూర్తిగా ఆ చిత్ర కధను అనుసరించి, ఆ దర్శకుడి అభిరుచి మేరకు వుంటుంది.
మీ మీద రెహమాన్ గారి ప్రభావం ఎంత వరకూ వుంటుంది . .
చిన్నప్పటి నుండీ ఆయన సంగీతం వింటూ వస్తున్నాను, So డెఫినెట్ గా కొంత ప్రభావం వుంటుంది. అయితే ఇది అన్ని విషయాల్లోనూ వుంటుంది కేవలం సంగీతమనే కాకుండా, ఇకపోతే నేను మొదటి నుండీ నా కంటూ ఒక సొంత బాణీ వుండాలని కోరుకొంటాను. ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల పాటలు వింటే అది మీకే తెలుస్తుంది. but anyways Rehman sir is like my first Guru.
ఈ రోజుల్లో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తూవున్నారు . . అన్ని రంగాల్లోనూ చాలా కాంపిటీషన్ వుంది. మరి వీటి మద్య మీరు చిత్రాల్లో ఇంత తొందరగా నిలద్రొక్కు కోవడానికి మీ వెనుక రెహ్మన్ గారు వుండడం ఒక కారణం అనుకోవచ్చా . . .
అలా ఏం కాదండి. ఈ రోజుల్లో ఎవరు ఎవరిని బట్టీ అవకాశాలు ఇవ్వరు. ఇప్పుడు వస్తున్న దర్శకులైతే సంగీతం నచ్చిందా ఓ.కే. నచ్చలేదా వెంటనే మిమ్మల్ని బయటకు నెట్టేస్తారు. నిజానికి అలా బ్యాక్ గ్రౌండ్ ని బట్టే ఈ రంగం లో నిలబడతారు అంటే, రాజా సార్ అబ్బాయి యువన్ సక్సస్ అయినట్లుగా మరి కార్తీక్ కాలేక పోయాడు. అలా అని కార్తీక్ మంచి మ్యూజికి ఇవ్వలేదా అంటే అతనూ మంచి సంగీతాన్ని ఇచ్చారు. So its all depends అండీ.
మీకు నచ్చిన నటీ నటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పేర్లు చెప్పండి . . .
బాలీవుడ్ లో షారూఖ్, అమీర్ లు తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, తెలుగు లో మహేష్ బాబు నా అభిమాన నటులు ఇక కాజల్, సిమ్రన్ లు నా అభిమాన నటీమణులు. ఇక సంగీత దర్శకులు అంటే రెహమాన్ గారే అతను కాకుండా అంటే రాజా సర్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన మొత్తం కలక్షన్ నా దగ్గర వుంది. అలాగే శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇక లతా మంగేష్కర్ గారు నా అభిమాన గాయనీ మణి.
మీరు పాడిన పాటల గురించి చెప్పండి . . .
పాడడం అన్నది జస్ట్ నా హాబీ మాత్రమే. అయితే చిన్నప్పుడు మాత్రం చాలా పాటలు పాడేసాను. కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు, దొంగా దొంగా, అలాగే జెంటిల్ మెన్ లో చికుబుకు చికుబుకు రైలే వీటన్నిటిలోనూ వచ్చే చిన్నపిల్లాడి గొంతు నాదే. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ పాడుతున్నాను. ఇటీవల నీ వల్లె నీ వల్లే చిత్రం లో కూడా పాడాను. ఇప్పటి వరకూ ఒక యాభై పాటలు పాడి వుంటాను.
మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి . . . సింఫొని చేసే వుద్దేశ్యాలు ఏమన్నా వున్నాయా . . .
బేసికల్ గా నేను మంచి పియనిస్ట్ ని. అయితే సింఫొని చేసే అవకాశాలు ఇప్పట్లో అయితే ఏం లేవు గానీ త్వరలోనే నా సొంత ఆల్బం ని రిలీజ్ చేద్దామని వుంది. అది కూడా ఒక చక్కని కాన్సెప్ట్ తో కూడి వుంటుంది. అలాగే ఆ ఆల్బ్ం లో చక్కని విజువల్స్ కూడా వుంటాయి. దానికి నేనే దర్శకత్వ భాద్యతలు కూడా వహిస్తున్నాను.
ఒక సంగీత దర్శకుడికి శాస్ర్తీయ సంగీతం తెలిసి వుండాలా?
వుండాలి. కనీసం బేసిక్స్ అన్నా తెలిసివుండాలి. ఎందుకంటే మామూలు ఇప్పటి చిత్రాలకూ లవ్ ఓరియెంటెడ్ చిత్రాలకూ మోడ్రన్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ కూ అది అవసరం లేకపోయినా కొన్ని కొన్ని సార్లు దర్శకుడు నాకు ఫలానా రాగం లోనే ఆ పాట కావాలి అంటే, అప్పుడు తప్పదు కదా. నా వరకూ నాకు కొద్దిగా తెలుసు, అలాగే కొన్ని రాగాలు కూడా నేను బాగా వుపయోగిస్తాను. అయితే నేనన్నా ఎవరన్నా అటువంటి సంగీతం ఇచ్చేముందు బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే చేయడం జరుగుతుంది.
ఇప్పుడు వస్తున్న పాటల్లో సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేసేస్తుంది అంటున్నారు . . దీనిపై మీ కామెంట్ . . .
అది ట్రెండ్ ని బట్టీ వుంటుంది. అయినా అన్ని పాటలకూ అలా వుండదే. ఇప్పుడు వున్న పబ్ కల్చర్ కి యెక్కువ బీట్ వున్న పాటలే కావాలి. అటువంటప్పుడు తప్పనిసరిగా మ్యూజిక్ డామినేషన్ అన్నది వుంటుంది. కానీ అవే సినిమాల్లో చక్కని మెలొడీ లు కూడా వుంటున్నాయి కదా. నా వరకూ నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన వెయిల్ చిత్రానికి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ కూడా వచ్చింది. నిజానికి ఒక సినిమా కి గేయ రచయిత కూడా ఒక కీలకమైన సాంకేతిక నిపుణుడే అని నా వుద్దేశ్యం. అతనికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు.
O K ప్రకాష్ గారూ మీరు ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకొంటూ మా టోటల్ టాలీవుడ్ బ్రౌజర్స్ తరపున మీకు శుభాబినందనలు తెలియజేస్తున్నాను.
Thank you very much.
|
Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode
|